IMPORTANT DECISIONS IN THE TTD BOARD MEETING _ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

Tirumala, 11 March 2024: TTD Trust Board meeting was held at Annamaiah Bhavan in Tirumala on Monday under the Chairmanship of Sri Bhumana Karunakara Reddy. The key decisions are as follows.

•  Approval to create 479 nurse posts to provide better medical services in view of the increasing number of patients in SVIMS  Hospital.

 -In the past in TTD, most of the recruitment of contract/outsourcing employees was done following their requirement in the respective areas and not through any notification, rule of reservation (RVR). To regularize the services of such employees as per G.O.No.114, the TTD board has decided to send a report on the same relaxing some of the rules requesting the state government.

– Approval towards the construction of hostels for providing accommodation to all the female students admitted in TTD colleges without any recommendation.

 – Tender approval towards the construction of 10 lifts in PAC-1 for the convenience of devotees in Tirumala at a cost of Rs.1.88 crores.

 – Sanction of security fencing left in the outer cordon area of Sri Padmavati Rest House, similarly, Balaji Nagar East side at Rs.1.50 crores.

 – Approval to take up development works of the remaining 184 quarters of old C type, D type, new C type and D type quarters of TTD employees in Tirumala with Rs.14 crores.

 – Approval towards the gold malam of the Makara Toranam in front of Bhashyakarlu in Tirupati Sri Govindarajaswamy temple, Tiruvabharans of Sri Parthasarathiswamy and Srikalyana Venkateswara Swamy.

TTD has a Tier 3 Data Center and Disaster Recovery Center for IT services.  As per IT standard protocol, tech replacement should be done every seven years as part of the lifecycle management process.  As part of this, a sanction of over Rs.12 crore towards the maintenance of data centres for five years has been approved.

 – There are 15 historic and ancient temples, 13 temples built by TTD and 22 temples taken over by TTD.  Permission towards undertaking necessary development works in these temples through SRIVANI Trust funds.

 – An ex gratia of Rs.5 lakhs to the family of Tirumala Srivari Temple Paricharika Sri Yathirajan Narasimhan who recently died in an accident on the ghat road.

Special Principal Secretary of Endowments Department Sri. Karikalavalavan, TTD EO Sri AV. Dharma Reddy, JEO Sri. Veerabraham and several board members participated in this meeting.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, మార్చి 11, 2024: తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠స్విమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్‌ చేసేందుకు ఆమోదం.

– టీటీడీలో గ‌తంలో చాలామంది నోటిఫికేష‌న్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌(ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ప‌రిపాల‌నా సౌల‌భ్యం కొర‌కు కాంట్రాక్టు/పొరుగుసేవ‌ల ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం జ‌రిగింది. జి.ఓ.నం.114 ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి వారి సేవ‌లు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వానికి నివేదిక పంపాల‌ని నిర్ణ‌యం.

•⁠ ⁠టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్‌ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్ట‌ళ్ల నిర్మాణానికి ఆమోదం.

•⁠ ⁠రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం.

•⁠ ⁠రూ.1.50 కోట్లతో బాలాజి నగర్‌ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్‌ కార్డన్‌ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఆమోదం.

•⁠ ⁠రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్‌, డి టైప్‌, కొత్త సి టైప్‌, డి టైప్‌ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.

•⁠ ⁠తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం.

•⁠ ⁠టీటీడీ ఐటీ సేవల కోసం టైర్‌ 3 డేటా సెంటర్‌, డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌ ఉన్నాయి. ఐటి స్టాండర్డ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలి. ఇందులోభాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్‌ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం.

•⁠ ⁠టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాల‌న అనుమ‌తికి ఆమోదం.

•⁠ ⁠ఇటీవల ఘాట్‌ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్‌ నరసింహన్‌ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం.

ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ క‌రికాల‌వ‌ల‌వ‌న్‌, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ప‌లువురు బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.