డయల్‌యువర్‌ ఇఓ కార్యక్రమము 

డయల్‌యువర్‌ ఇఓ కార్యక్రమము

తిరుపతి, 2010 అక్టోబర్‌ 01: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులతో కలసి చక్కటి ప్రణాళికను రూపొందిస్తామని టిటిడి ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు  వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం డైల్‌యువర్‌ ఇఓ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా వివిధ అంశాలపై భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఇఓ కృష్ణారావు సమాధానలు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణారావు మాట్లాడుతూ గత నెల జరిగిన డైల్‌యువర్‌ ఇఓలో భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు లడ్డూలో నాణ్యతను పెంచి అందిస్తున్నామని వివరించారు.

అదేవిధంగా శ్రీవారి దర్శన విధివిధానాలలో మార్పుల కోసం నవంబర్‌ మొదడి వారంలో తిరుపతిలో సదస్సు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు మాట్లాడుతూ తిరుమలకు వచ్చిన భక్తులకు స్వామివారు శంఖు, చక్రాలు ఉండే స్టిక్కర్లు దొరుకుతున్నాయని శ్రీవారి పాదాలు స్టిక్కర్ల ను కూడా అందుబాటులోకి తీసుకరావాలని కోరారు. దీనిపై స్పందించి ఇఓ శ్రీ కృష్ణారావు తప్పకుండా ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు చెందిన రమణమూర్తి మాట్లాడుతూ క్యూలైన్లలో నూస్‌ పేపర్లను విక్రయిస్తున్నారని వీటిని చదివిన భక్తులు అక్కడే వదలి వెళ్తున్నారని ఈ పేపర్లను అమ్మకుండా నిరోదించాలని కోరారు. క్యూలైన్లలో న్యూస్‌ పేపర్ల అమ్మకాలు లేకుండా చేస్తామని ఇఓ స్పష్టం చేశారు. అనంతపురం జల్లా గుత్తికి చెందిన శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి సమాధానం ఇస్తూ ధర్మసూక్ష్మాలు షూటింగ్‌కు ముందు వారం రోజుల పాటు ఫోన్‌నెంబర్‌ స్క్రోలింగ్‌ ఇస్తామని తెలిపారు.

రావులపాలెంకు చెందిన సాయి మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చే మహిళలకు డ్రస్‌కోడ్‌ గురించి అడుగగా ఈనియమాన్ని కఠినంగా అమలు చేస్తామని శ్రీ కృష్ణారావు స్పష్టం చేశారు. ఒంగోలుకు చెందిన కిషోర్‌ మాట్లాడుతూ శ్రీవారి సేవకు వచ్చే టీం లీడర్స్‌ డబ్బులు అడుగుతున్నారని పిర్యాదులు వస్తే ఆతరువాత వారికి అవకాశం ఇవ్వలేదని మీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యను నివృత్తి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివి & ఎస్‌ఓ శ్రీ ఎంకె. సింగ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.