డాక్టర్ లతామంగేష్కర్ అన్నమాచార్య సంస్కృత కీర్తనలు ఆలాపన
డాక్టర్ లతామంగేష్కర్ అన్నమాచార్య సంస్కృత కీర్తనలు ఆలాపన
తిరుపతి, జనవరి -27, 2011: ప్రఖ్యాతగాయని భారతరత్న డాక్టర్ లతామంగేష్కర్ కలియుగదైవమైన శ్రీహరి భక్తురాలు శ్రీతాళ్ళపాక అన్నమయ్య సంస్కృత కీర్తనలపట్ల అభిరుచి కలిగిన విశిష్టవ్యక్తి. ఆ సంగీత విదుషీమణి అభిరుచిని గుర్తించి తితిదే వారు అన్నమాచార్య సంస్కృత కీర్తనలను స్వరపరచి ఆమెచే పాడించాలని సంకల్పించారు.
ఈ సంస్కృత కీర్తనలను తితిదే ఎఫ్.ఎం. రేడియో స్టేషన్‌మేనేజర్ డాక్టర్ ఆకెళ్ళ విభీషణశర్మ ఎంపిక చేసి డాక్టర్ లతామంగేష్కర్‌కు అర్థతాత్పర్యాలను వివరించారు.
1. మాజహిహి 2. తవమాంద్రష్టుం 3. ఏవందర్శయసి 4. థవిధాచరణం
5. త్వమేవశరణం 6. యాదృశానాం… 7. పృధులహేమకాపీనధర…… పై కీర్తనలకు టెస్ట్ట్రాక్కై తితిదే సంగీత కళాశాల ఉపన్యాసకులు శ్రీ శబరిగిరీష్ స్వరపరచి సిద్ధం చేశారు. అన్నమయ్య 32 వేల సంకీర్తనలను రచించాడని, వాటిలో లభిస్తున్న 90 సంస్కృత కీర్తనలు రమణీయమైనవి ఉన్నాయని వాటిని హిందూస్తానీ, ఇటు కర్ణాటక సంగీతాలకు అనుసంధించాలన్నది తితిదే ఆశయం. వీటిని పరిశీలించి అంగీకరించిన డాక్టర్ లతామంగేష్కర్ ఆమె వైయ్యక్తిక సంగీత దర్శకుడు శ్రీమయూర్పామ్చే ట్రాక్ సిద్ధపరుచుకొని – కమనీయంగా ఆలపించారు. అటు డాక్టర్ లతాజీ, ఇటు తితిదేకు అనుసంధానంగా శ్రీ ఆర్.వి.రమణమూర్తి, సాంస్కృతికరంగ సేవాదకక్షులు, హైదరాబాదువారు స్వచ్ఛందంగా సహకరించారు.
ఈ సిద్ధపరచిన అన్నమయ్య స్వరలతా కీర్తనాంజలి – రాష్ట్ర ముఖ్యమంత్రిచే ఈనెల 30న తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న నాదనీరాజన వేదికపై ఆవిష్కరింపబడుతున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.