BABU JAGAJIVANRAM IS A TRUE INSPIRATION – JEO _ డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి- జేఈవో శ్రీ వీరబ్రహ్మం
Tirupati, 05 April 2024: TTD JEO Sri Veerabraham asked everyone to take Babu Jagajjivanram’s life as an example and work hard to achieve their dreams.
Dr. Babu Jagjeevanram’s 117th birth anniversary celebrations were grandly organized by TTD at Mahati Auditorium in Tirupati on Friday.
On this occasion, JEO informed that Babu Jagajjeevan Ram, who was born in a low caste, despite having no money and faced caste discrimination, overcame them. With discipline, perseverance and honesty in Indian politics, he held various ministerial posts and set an example for future generations.
He said that before and after India’s Independence, he studied the problems in the society and worked hard to solve them. As the first labor minister after independence, he brought many laws for the advancement of workers.
Later many TTD employees gave speeches on the occasion.
Earlier, puja was performed to the portrait of Srivaru and Pushpanjali was offered to the portrait of Dr Babu Jagajjeevanram.
Deputy EOs Smt Snehalatha, Sri Devendra Babu, other dignitaries and a large number of TTD employees participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
– ఆయన ఆశయసాధనే నిజమైన నివాళి
– జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుమల, 2024 ఏప్రిల్ 05: సమసమాజ స్థాపన కోసం పాటు పడిన డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం కోరారు. డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 117వ జయంతి వేడుకలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ నిమ్నకులంలో జన్మించిన బాబు జగజ్జీవన్‌రామ్ డబ్బు లేకపోయినా, కులవివక్ష ఎదురైనా వాటిని అధిగమించారని, కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని పదవిని అలంకరించారని తెలియజేశారు. భారత రాజకీయాలలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో వివిధ మంత్రి పదవులకు వన్నెతెచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, అటుతరువాత సమాజంలో సమస్యలను అధ్యయనంచేసి, వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం మొదటి కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల అభ్యున్నతి కోసం పలు చట్టాలు తీసుకువచ్చారన్నారు.
తరువాత పలువురు టీటీడీ ఉద్యోగులు ప్రసంగించారు. అంతకుముందు జేఈవో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగజ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.