ANNAMAIH VARDHANTI MAHOTSAVAMS BEGINS AT ANNAMACHARYA KALAMANDIRAM _ ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 521వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 05 APRIL 2024: The five-day 521st Tallapaka Annamacharya Vardhanti Utsavams commenced with a rendition of Saptagiri Sankeertana Gosti Ganam at Annamacharya Kalamandiram in Tirupati on the auspicious day of Dwadasi on Friday.

Similar Gosti Ganam will be observed at Tallapaka Dhyana Mandiram in the home turf of the saint poet and also at the 108 feet statue of Sri Tallapaka Annamacharya located in Rajampeta-Kadapa highway road on Friday.

Annamacharya Project Director Dr Vibhishana Sharma is supervising all these events in Tirumala, Tirupati and Tallapaka.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 521వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

– అన్నమాచార్య కళామందిరంలో ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం

తిరుపతి, 2024 ఏప్రిల్ 05: శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.

ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి దిన‌ము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ప‌ద్మ‌ప్రియ బృందం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల‌కు వ‌ర‌కు శ్రీ‌మ‌తి ఆర్తి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు.

తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ శ్యామ్‌కుమార్ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన శ్రీ ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేయనున్నారు.

రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద శుక్ర‌వారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మ‌ణి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన వెంక‌ట కృష్ణ‌య్య బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుసంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.