TIRUCHANOOR BRAHMOTSAVAMS FROM DEC 2 TO DEC 8 _ డిశెంబరు 2 నుండి 8 వరకు తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు
Padmavathi at Tiruchanoor will be from December 2 to 8, said TTD EO
Sri IYR Krishna Rao.
on Monday he said, the “Lakshakumkumarchana” ritual will be on December 1 followed by Ankurarpanam for the brahmotsavams on the same day evening.
temple Deputy EO, Sri Muniratnam Reddy, Deputy EO reception
Smt.Parvathi, SE Sri Ramachandra Reddy released the Brahmotsavam
posters.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD
డిశెంబరు 2 నుండి 8 వరకు తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2010 నవంబర్-15: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిశెంబరు 2 నుండి 8 వరకు జరుగనున్నాయని, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలిపారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిధిగృహంలో సోమవారం నాడు విలేకరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిశెంబరు 1న ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పాణ కార్యక్రమాలు జరుగుతాయని ఇఓ చెప్పారు.
ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిశెంబరు 2, గురువారం ఉదయం మకర లగ్నంలో 9.40 ని. నుండి 10.00 ని. నడుమ గజపట ధ్వజారోహణంతో ప్రారంభమౌతాయని ఆయన అన్నారు. ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన డిశెంబరు 6 సాయంత్రం 8.30 గంటలకు గజవాహనం, డిశెంబరు 7న సాయంత్రం 4.35 గంటలకు స్వర్ణరథం, డిశెంబరు 9నాడు ఉదయం 7.15 నిముషాలకు రథోత్సవం, డిశెంబరు 10 మధ్యాహ్నం 12 గంటలకు కుంభ లగ్నంలో నిర్వహించే పంచమీతీర్థంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. ఇక డిశెంబరు 11న అమ్మవారికి పుష్పయాగం కూడా నిర్వహిస్తారన్నారు.
అంతకు పూర్వం ఈఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, సంయుక్త కార్యనిర్వహణ అధికారి (తిరుమల) శ్రీ కె.భాస్కర్ బ్రహ్మోత్సవ పోస్టర్లను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ మునిరత్నం రెడ్డి, డిప్యూటీ ఇఓ (రిసెప్షన్-తిరుపతి) శ్రీమతి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.