DHANUR MASA TIRUPPAVAI PRAVACHANAMS TO BEGIN AT ANNAMACHARYA KALA MANDIR FROM DECEMBER 17 _ డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం
Tirupati,16 December: The TTD is organising Tiruppavai pavachanams by eminent pundits across the country from December 17 to January 14 as part of Dhanur masa festivities.
The pravachanam will commence at Annamacharya Kala Mandir at 5.30 PM on December 17 and continue till January 14 under the leadership of Acharya Chakravarti Ranganathan and in the aegis of TTD’s Alwar Divya Prabandam Project.
Similarly, such parayanams will be organised at 250 locations in AP, Telangana, Tamilnadu, Karnataka, Puducherry, MP etc.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం
తిరుపతి, 2022 డిసెంబరు 16: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 17న సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరుగనుంది.
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్ర్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, పిఆర్వో డాక్టర్ టి రవి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆచార్య చక్రవరి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.
ధనుర్మాసం ముగిసే వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో. ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాలు పారాయణం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 250 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.