SADHU SUBRAMANYA SHASTRI JAYANTHI ON DECEMBER 17 _ డిసెంబరు 17న శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతి
Tirupati, 14 December 2021: The 132nd Birth Anniversary of Sri Sadhu Subramanya Shastri will be observed by TTD on December 17 at Tirupati.
After offering floral tributes to the bronze statue of the great scholar, there will be a brief seminar on his life history at SVETA Bhavan.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 17న శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతి
తిరుపతి, 2021 డిసెంబరు 14: తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తరువాత తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తారు. శ్రీమాన్ సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.