డిసెంబరు 11న నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి పవిత్రోత్సవం
డిసెంబరు 11న నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి పవిత్రోత్సవం
తిరుపతి, 2020 డిసెంబరు 06: టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీన పవిత్రోత్సవం జరుగనుంది. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇందుకోసం డిసెంబరు 10న అంకురార్పణం, సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.
పవిత్సోత్సవంలో భాగంగా డిసెంబరు 11న ఉదయం స్నపనతిరుమంజనం, మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్ర సమర్పణ చేపడతారు.
ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి కె.పార్వతి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.