డిసెంబ‌రు 12న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

డిసెంబ‌రు 12న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

తిరుమ‌ల‌, 2021 డిసెంబర్ 10: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబ‌రు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సంద‌ర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. ప‌విత్ర కార్తీక మాసం చివ‌రి ఆదివారం స్వామివారికి తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంద‌ర్భంగా స్వామివారికి ఉద‌యం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళ‌తో తిరుమంజ‌నం నిర్వ‌హించి, సింధూరంతో విశేష అలంక‌ర‌ణ చేయ‌నున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.