SARASWATHI KANKANAM DISTRIBUTION TO STUDENTS SOON-TTD CHAIRMAN _ డిసెంబ‌రు 7న భారీస్థాయిలో గీతాజ‌యంతి నిర్వ‌హిస్తాం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 29 Nov. 19: To enhance the will power among students and for their personality development, Saraswathi Kankanams will be distributed soon to class VI to Inter pupils, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy. 

During the Executive meeting of HDPP held at SPRH in Tirupati on Friday he said, the programme will be observed in a big way in Vijayawada and Hyderabad. 

He said, lectures with experts will also be given and Gurupoojostavam will be observed on a grand scale in twin Telugu states next year. 

The Chairman said, Gita Jayanthi will be observed on a grand acale in SV High School grounds at Tirupati on December 7 with 10thousand students. A massive nation wide programme on Dasa Project is also on chords next year, he added. 

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri P Basanth Kumar, Board Member Sri M Sriramulu, Sri Sivakumar, special invitees Sri B Karunakara Reddy, Sri Govindahari, Deputy EO TTD Press Sri Vijay Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

డిసెంబ‌రు 7న భారీస్థాయిలో గీతాజ‌యంతి నిర్వ‌హిస్తాం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2019 న‌వంబ‌రు 29: స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌గ‌వ‌ద్గీత ప్రాశ‌స్త్యాన్ని నేటి విద్యార్థుల‌కు తెలియ‌జేసేందుకు డిసెంబ‌రు 7న 10 వేల మంది విద్యార్థుల‌తో గీతాజ‌యంతి ఉత్స‌వాన్ని తిరుప‌తిలో భారీస్థాయిలో నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శుక్ర‌వారం టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ 6వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి నివార‌ణ‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వ్య‌క్తిత్వ వికాస నిపుణుల‌తో ఉప‌న్యాసాలు, స‌ర‌స్వ‌తి కంక‌ణాలు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. త్వ‌ర‌లో విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, వ‌చ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల‌కు విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. దాస సాహిత్యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లో జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌న్నారు. గురువుల ప్రాముఖ్య‌త‌ను తెలిపేలా గురుపూజోత్స‌వాన్ని చేప‌డ‌తామ‌ని చెప్పారు. నిరుప‌యోగంగా ఉన్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను గుర్తించి వాటిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొస్తామ‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారానికి కృషి చేస్తున్న ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, బోర్డు స‌భ్యులు శ్రీ మోరంశెట్టి రాములు, శ్రీ శివ‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, కో-ఆప్టెడ్ స‌భ్యులు శ్రీ బి.సుబ్బారావు, శ్రీ జి.నారాయ‌ణ‌రాజు, శ్రీ పెంచ‌ల‌య్య‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి, క‌న్వీన‌ర్ ఆచార్య రాజ‌గోపాల‌న్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.