KALAMKARI BE DECLARED AS STATE ART- TTD JEO (H&E) _ ఢిల్లీలో టీటీడీ శిల్పకళాశాల విద్యార్థుల ఎగ్జిబిషన్ _ జేఈవో శ్రీమతి సదా భార్గవి

TTD SCULPTURE STUDENTS EXHIBITION AT NEW DELHI SOON

Tirupati,16 February 2023:  TTD JEO for Health and Education Smt Sada Bhargavi said on Thursday that TTD will campaign to make Kalamkari as a State Art.

Addressing the concluding ceremony of the three-day exhibition cum sales of artefacts organised at SV sculpture college in Tirupati the TTD JEO said to expose the skills of students TTD is contemplating to organise an exhibition at the Delhi art gallery soon as an encouragement to the students.

She said TTD intends to promote sculpture exhibitions as a role model and while the first exhibition attracted a footfall of over 15000 visitors while the current one over 6500 visitors within three days.

As part of its promotion of traditional fine arts TTD would conduct a workshop in August and another exhibition in November to encourage and attract students pursuing the traditional sculpture courses, She also said TTD is providing English medium of coaching, 3D computer teaching and evening courses for the convenience of students.

TTD DEO Sri Bhaskar Reddy, Principal Sri Venkat Reddy also spoke on the occasion while some students narrated their experiences during the exhibition and thanked TTD for encouraging them with such expos to have better exposure.

Thereafter the JEO felicitated the sculpture artist Sri Maniratnam, Smt Gayatri Devi, Kumari Lavanya, Sri Munusamy, College first batch student Sri Amaralingacharya on occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఢిల్లీలో టీటీడీ శిల్పకళాశాల విద్యార్థుల ఎగ్జిబిషన్

– కలంకారిని రాష్ట్ర కళ గా ప్రకటించేందుకు ప్రయత్నం

జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 16 ఫిబ్రవరి 2023: టీటీడీ శిల్ప కళాశాల విద్యార్ధుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఢిల్లీ లోని ఆర్ట్ గ్యాలరీలో వీరి ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయిస్తామని జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. కలంకారి కళను రాష్ట్ర కళ గా ప్రకటించేందుకు ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

ఎస్వీ శిల్ప కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిల్పకళా ప్రదర్శన, అమ్మకాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి జేఈవో శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ద్వారా కళాకారుల ప్రతిభ బయటి ప్రపంచానికి తెలియడంతో పాటు, కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుందన్నారు. 2020 ఫిబ్రవరి లో నిర్వహించిన తొలి ఎగ్జిబిషన్ కే 15 వేల మంది సందర్శకులు వచ్చారని ఆమె తెలిపారు. డాక్టర్, ఇంజినీరింగ్ మాత్రమే చదువులనే భ్రమ నుండి బయట పడి కళల అభ్యాసన కూడా గొప్ప చదువేననే వాస్తవం ప్రజలు గ్రహించాలని ఆమె కోరారు. ఇలాంటి సాంప్రదాయ కళల పోషణకు టీటీడీ ఎప్పుడూ ముందుంటుందని జేఈవో వివరించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్ లో 6503 మంది పాల్గొన్నారని ఆమె తెలిపారు. దీనికి కొనసాగింపుగా ఆగస్టు లో వర్క్ షాప్, నవంబరులో మరో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. శిల్ప కళాశాల విద్యార్హులకు ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు, 3డి కంప్యూటర్ లో కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఆసక్తి ఉన్న వారి కోసం సాయంత్రం కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ శిల్ప కళాశాల దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకట రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు శిల్పకళా ప్రదర్శన వల్ల తమకు లభించిన ధీమా, అనుభూతులను వివరించారు.

కళాకారులు శ్రీ మునిరత్నం, శ్రీమతి గాయత్రి దేవి, కుమారి లావణ్య, శ్రీ మునుస్వామి, కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థి శ్రీ అమరలింగా చారిని జేఈవో శాలువతో సత్కరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది