PAVITROTSAVAMS IN TALLAPAKA _ తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 28 AUGUST 2021: The annual Pavitrotsavams in Sri Siddheswara Swamy temple at Tallapaka in YSR Kadapa district commenced on a religious note in Ekantam on Saturday evening due to Covid Pandemic.

On August 29, Vaidika programs, Grandhi Pavitra Puja will be observed. While on August 30, Nitya puja, Nitya homam, Pavitra grandhi Samarpana, Purnahuti, Pavitra vitarana will be held.

Later deities will be paraded on a procession in Ekantam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 ఆగస్టు 28: వైఎస్ఆర్‌ కడప జిల్లా తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, వాస్తు హోమము, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఆగస్టు 29న ఉద‌యం 8 గంట‌ల‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, గ్రంధి ప‌విత్ర పూజ జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 30న నిత్యపూజ, నిత్య హోమం, గ్రంధి పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌, పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆల‌యంలో ఏకాంత‌గా ఊరేగిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.