తితిదేలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

తితిదేలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

తితిదేలో ఏప్రిల్‌ 14న జరుగనున్న భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 122వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలో శనివారం ఉదయం 8.00 గంటలకు జయంతి ఉత్సవం ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఐజిపి శ్రీ రాధాకృష్ణ, ఐ.పి.ఎస్‌, నల్గొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఐ.ఏ.ఎస్‌ ఉపన్యాసకులుగా హాజరుకానున్నారు. వీరు అంబేద్కర్‌ జీవిత విశేషాలను వివరించనున్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.