తితిదే విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా మూడో బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో సత్కారం

తితిదే విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా మూడో బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో సత్కారం

తిరుపతి, సెప్టెంబరు 03, 2013: తితిదేలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులకు సెప్టెంబరు నుండి ప్రతి నెలా మూడో బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో మర్యాదపూర్వక సన్మానం చేస్తారు. విశ్రాంత ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సహా ఉదయం బ్రేక్‌ దర్శనం సమయంలో ఆలయంలోకి ప్రవేశించి మర్యాదపూర్వక సన్మానం పొందాల్సి ఉంటుంది. సన్మానం పొందే విశ్రాంత ఉద్యోగులకు 8 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్‌ కూడా అందజేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది