తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అహోబిల మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అహోబిల మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ
తిరుపతి, 19 మార్చి 2020: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం, అహోబిల మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ గురువారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శేషవస్త్రం, పూలమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, అర్చకులు శ్రీ బాబుస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారిని స్వామీజీ దర్శించుకున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.