TTD EO INAUGURATES GARDEN EXPO _ తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టీటీడీ ఈవో
TIRUPATI, 20 NOVEMBER 2022: As a part of the ongoing annual brahmotsavams in Tiruchanoor which commenced on Sunday, TTD EO Sri AV Dharma Reddy inaugurated the Garden exhibition in Friday Gardens in Tiruchanoor.
Speaking on the occasion, the EO said, the expo setup by the TTD Garden wing has episodes from Krita, Treta, Dwapara and Kaliyugas and other famous contexts from various epics of Hindu Sanatana Dharma. He said, the devotees who come to witness the Vahana sevas should also pave a visit to the Garden expo.
The settings include the renowned episode of “Ksheera Sagara Madhanam” wherein Goddess Sri Lakshmi Devi emerges while churning the milk ocean by deities and demons using Mandara Mount as chruner and Vasuki Serpent as rope, Lord Sri Maha Vishnu in Kurmavatara, Killing of Tataki by Sri Rama Lakshmana under the instructions of Sage Viswamitra, Surpanakha Garvabhangam, Killing of demon Trunavrita by Sri Krishna, Bhimasena killing Duryodhana, Tallapaka Annamacharya offering his literary works to Sri Venkateswara, Gomata in Sand Art and many more interesting dioramas.
Apart from this the artistic works mandapams, elephants, ratham, Goddess Sri Mahalakshmi of Kolhapur with vegetables, roses, petronia, salvia, begonia, crysanthimum etc., stood as special attractions.
The expo by SV Ayurvedic college, Pyramid Spiritual Society expo on meditation etc. also enhanced the glory of the exhibition.
JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu and devotees participated.
తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టీటీడీ ఈవో
తిరుపతి, 2022 నవంబరు 20: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన వివిధ ప్రదర్శనశాలలను ఆదివారం టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వివిధ పౌరాణిక అంశాలతో కూడిన సెట్టింగులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అమ్మవారి వాహన సేవలతో పాటు వీటిని కూడా తిలకించాలని ఆయన కోరారు
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరాణిక ఘట్టాలు ఆకట్టుకున్నాయి. ఇందులో క్షీర సాగర మధనం జరిగేటప్పుడు మందర పర్వతంలో కూర్మావతారంలో వస్తున్న విష్ణుమూర్తి, విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ మేరకు తాటకి రాక్షసిని సంహరిస్తున్న రామలక్ష్మణులు, తాను రాసిన కీర్తనలను శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అంకితమిస్తున్న శ్రీ తాళ్లపాక అన్నమయ్య, సూర్పనఖ ముక్కు,చెవులను ఖండిస్తున్న లక్ష్మణుడు, సుడిగాలి రూపమున తనను సంహరించవచ్చిన తృనావర్తుడు అనే రాక్షసుడిని సంహరిస్తున్న చిన్ని కృష్ణుడు, సీతాదేవి రూపొందించిన సైకత శివలింగమునకు అభిషేకం చేస్తున్న సీతారాములు, శ్రీకృష్ణుడి సహాయంతో దుర్యోధనుడిని సంహరిస్తున్న భీమసేనుడు, అష్టలక్ష్మీ వైభవం, శ్రీ శ్రీనివాసుడికి క్షీరధారలు కురిపిస్తున్న గోమాత సైకత శిల్పం తదితర పౌరాణిక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా, కూరగాయలతో రూపొందించిన దేవతామూర్తుల మండపం, చామంతి, రోజాలు, పెట్రోనియా, బిగోనియా, సాల్వియా తదితర జాతుల రంగురంగుల పూల మొక్కలు, పూలతో రూపొందించిన ఏనుగు, రథం, కొల్హాపూర్ నందు వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి.
అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్రదర్శనశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, బ్రహ్మర్షి పత్రీజీ పిరమిడ్ స్పిచువల్ సొసైటీ వారి ధ్యానం వల్ల కలిగే లాభాలపై ప్రదర్శన ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.