FIELD TRAINING GIVEN TO EMPLOYEES AT SRI PAT, SRI AT _ తిరుచానూరు, అప్పలాయగుంట లో టీటీడీ ఉద్యోగులకు క్షేత్రస్థాయి శిక్షణ
TIRUPATI, 18 JULY 2021: The 119 employees who have been recently inducted into TTD under compassionate appointment had visited Sri Padmavathi temple at Tiruchanoor and Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Sunday as a part of their training programme.
SVETA Director Sri Ramanjulu Reddy, took them for a field visit to these temples. After darshan of the premier deities in both the temples, the Archakas explained to them about Kshetra Mahatyam, Sthala Puranam, important festivals, rituals, Agamas, queue line system etc.
The officials of the respective temples took part in this programme.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు, అప్పలాయగుంట లో టీటీడీ ఉద్యోగులకు క్షేత్రస్థాయి శిక్షణ
తిరుపతి 18 జూలై 2021: టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు ఆదివారం క్షేత్ర స్థాయి శిక్షణ ఇచ్చారు.
శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులు రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు తొలుత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు ఆలయ విశిష్టత, శ్రీనివాస -అమ్మవారి పరిణయ క్రమం, ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, పుష్కరిణి ఇతర వైదిక విషయాల గురించి ఉద్యోగులకు తెలియజేశారు. ఆలయంలో క్యూ లైన్ల నిర్వహణ, ఇతర పరిపాలన అంశాల గురించి డిప్యూటి ఈవో శ్రీమతి కస్తూరి బాయి వివరించారు. ఆలయ పోటు, శిల్పసంపద వివరాలు శ్వేత డైరెక్టర్ చెప్పారు.
అనంతరం ఈ బృందం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు శ్రీవారు సిద్ధేశ్వర మహర్షి తపస్సుకు మెచ్చి, ఆయనకు అభయం ఇచ్చి ఇక్కడ కొలువైన విషయాల గురించి తెలియజేశారు. ఈ విషయాలన్నీ ఉద్యోగులు తమ పుస్తకాల్లో రాసుకున్నారు. క్షేత్రస్థాయి శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తిరుచానూరు ఆలయ ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.