KOIL ALWAR TIRUMANJANAM HELD AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 16 Feb. 21: Ahead of the holy Ratha Sapthami festival on February 19, the Koil Alwar Tirumanjanam was organised at Sri Padmavati temple in Tiruchanoor on Tuesday.
After morning rituals, the holy cleansing ritual of the temple was performed with desi herbs and aromatic leaves etc. before commencing sarva Darshan.
DyEO Smt Jhansi Rani, AEO Sri Subramaniam, superintendent Smt Malleswari, temple inspector Sri Rajesh and temple Archakas were present.
CURTAINS DONATED
Devotee from Tirupati Sri Narasimhulu has donated eight curtains to Sri Padmavati temple on Tuesday
RADHASAPTHAMI ON FEBRUARY 19
As part of Surya Jayanti celebrations TTD is organising Ratha Sapthami with seven vahana sevas and bless devotees on February 19 at Goddess Sri Padmavati Temple, Tiruchanoor.
Morning 07.30-8.30 am Surya Prabha
09.00-10.00 am Hamsa Vahana
10.00- 11.00 am. Aswa vahana
12.00-1.00 pm. Garuda vahana
1.30-2.30 pm. Chinna Sesha Vahana
6.00-7.00 pm. Chandra Prabha vahana
8.30-9.30 pm. Gaja vahana
TTD is organising Snapana thirumanjanam for utsava idol of Goddess Padmavati at Krishna Mandapam in the evening.
In view of daylong festivities, the TTD has cancelled all arjita sevas like Kalyanotsava, Lakshmi puja, Unjal Seva and break darshans.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2021 ఫిబ్రవరి 16: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 19న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
పరదాలు విరాళం :
తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు ఆలయానికి మంగళవారం ఉదయం 8 పరదాలు విరాళంగా అందించారు.
ఫిబ్రవరి 19న రథసప్తమి
ఫిబ్రవరి 19వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహనసేవల వివరాలు
సమయం వాహనం
ఉ. 7.30 – ఉ. 8.30 సూర్యప్రభ వాహనం
ఉ. 9.00 – ఉ. 10.00 హంస వాహనం
ఉ. 10.30 – ఉ. 11.30 అశ్వ వాహనం
మ. 12.00 – మ. 1.00 గరుడ వాహనం
మ. 1.30 – మ. 2.30 చిన్నశేష వాహనం
సా. 6.00 – రా. 7.00 చంద్రప్రభ వాహనం
రా. 8.30 – రా. 9.30 గజ వాహనం
కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజలసేవ, బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో..
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.