SPECIAL PROGRAMS FOR ANNAMACHARYA FETE _ ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 519వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 29 MARCH 2022: The 519th Vardhanti Mahotsavam of Sri Tallapaka Annamacharya commenced in Tirupati with Sapthagiri Gosthi Ganam at Annamacharya Kalamandiram on Tuesday.

Later Harikatha Parayanams followed.

While in the evening at Mahati Auditorium the Mangaladhwani and classical dance mused the audience.

The Project officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 519వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

అన్నమాచార్య కళామందిరంలో ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం

తిరుపతి, 2022 మార్చి 29: తొలి తెలుగు వాగ్గేయ‌కారుడు, శ్రీ‌వారి అప‌ర‌భ‌క్తుడు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి మహోత్సవాలు టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.

ముందుగా ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి  దిన‌ము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

ఆ త‌రువాత ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌ బృందం గాత్ర సంగీత స‌భ చేప‌ట్టారు. అనంత‌రం ఉదయం 11.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి మునిల‌క్ష్మీ బృందం ” భ‌క్త మార్కండేయ ” అనే అంశంపై హరికథాగానం చేశారు.

కాగా, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు శ్రీ‌మ‌తి సుశీల బృందం గాత్ర సంగీతసభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి సీతాల‌క్ష్మి ”  భీష్మ విజ‌యం ” అనే అంశంపై హరికథ పారాయ‌ణం చేయ‌నున్నారు.

మహతిలో :

తిరుపతి మహతి కళాక్షేత్రంలో మంగ‌ళ‌వారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ర‌విప్ర‌భ‌, శ్రీ‌మ‌తి ఈశ్వ‌ర‌మ్మ‌ బృందం మంగ‌ళ‌ధ్వ‌ని, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వైజాగ్‌కు చెందిన శ్రీ చైత‌న్య బ్ర‌ద‌ర్స్ బృందం సంగీత స‌భ, రాత్రి 7.15 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు డా. ఉషారాణి కూచిపూడి నృత్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుల సంచాల‌కులు డాక్టర్ ఆకెళ్ల‌.విభీషణ శర్మ, ఏఈవో శ్రీ శ్రీ‌రాములు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, ఇతర అధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.