తిరుపతి నుండి తిరుమలకు 10 తి.తి.దే బస్సుల ఏర్పాటు – తిరుమల జె.ఇ.ఓ

తిరుపతి నుండి తిరుమలకు 10 తి.తి.దే బస్సుల ఏర్పాటు – తిరుమల జె.ఇ.ఓ

తిరుమల, 27 ఆగష్టు 2013 : సమైఖ్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఆగష్టు 28, 29 తారీఖుల్లో తిరుపతి తిరుమల అష్టదిగ్భందనానికి జె.ఏ.సి పిలుపునిచ్చిన కారణంగా తి.తి.దే తిరుపతి రైల్వేస్టేషన్‌ నుండి శ్రీనివాసం, కపిలతీర్థం, అలిపిరి మీదుగా భక్తులను తరలించడానికి 10 తి.తి.దే బస్సులను భక్తుల సౌకర్యార్థం రంగంలోకి దింపనున్నట్లు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. అదేవిధంగా వివిధ మార్గాల నుండి అలిపిరికి స్వంత, ప్రైవేటు వాహనాల్లో చేరే భక్తులకు కూడా మినహాయింపు ఇచ్చినందుకు, తి.తి.దే చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సహకరిస్తున్న తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.