తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి పూజ
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి పూజ
తిరుపతి, 2020 ఆగస్టు 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శనివారం వినాయక చవితి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో చవితి పూజ ఏకాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.