తిరుమలలోఆగష్టు 9న పురుశైతోట ఉత్సవం

తిరుమలలోఆగష్టు 9న పురుశైతోట ఉత్సవం

తిరుమల, 08 ఆగష్టు 2013 : తిరుమలలో శుక్రవారంనాడు ఆండాళ్‌ శ్రీగోదాదేవి పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని తిరువాడిపురం ఉత్సవాన్ని, అదే విధంగా ఇదే రోజు శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుల్లో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు స్వామివారిలో ఐక్యం చెందిన పర్వదినాన్ని పురస్కరించుకొని పురుశైవారి తోటోత్సవాన్ని తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది.

ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కూడి అనంతాళ్వారు తోటలోనికి వేంచేపు చేస్తారు. అనంతరం అనంతాళ్వాన్‌ బృందావనం సమీపంలో పొగడమానుగా వెలసివున్నట్లుగా భావించే శ్రీ అనంతాళ్వారుల వారికి పూజాది నివేదనలు అయిన పిదప ప్రదక్షణ మార్గంలో ఊరేగుతూ మలయప్పస్వామివారు ఆలయంలోనికి వేంచేపు చేయడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.