CONSTRUCTION OF PILGRIMS AMENITIES COMPLEX IN KARNATAKA CHOULTARIES AREA AT TIRUMALA _ తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో వసతి సముదాయాల నిర్మాణనికి నిర్ణయం

TTD CHAIRMAN MEETS KARNATAKA CM

Tirumala, 3 Jul. 20: In the land leased to Karnataka Charities at Tirumala, both TTD and Karnataka Government have agreed to construct a Pilgrim Amenities Complex. 

TTD Chairman Sri Y V Subba Reddy along with EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy met the Karnataka Chief Minister Sri B S Yediyurappa at Bangalore on Friday.

In 2008, TTD has given 7.05 acres of land on a 50-year lease to Karnataka Government. 

The subject was discussed by the Karnataka Endowment Commissioner Smt A S Rohini Sindhuri with TTD Chairman and also inspected the Karnataka Choultry area. Thereafter the TTD Chairman, EO and Additional EO were invited by the Karnataka CM to Bangalore to take the issue forward.

Subsequently, it was agreed to construct a Complex as per TTD norms leaving 1.94 acres vacant leased land on West Mada Street keeping in view the necessities of pilgrims during Brahmotsavams and other days and taking up construction activity in the remaining leased land. The Karnataka Government would soon submit a plan to TTD Board for approval.

Thereafter the Karnataka Government will also deposit Rs 200 Crore with TTD for taking up construction works. The foundation stone for the construction will be laid by Karnataka CM.

As per the agreement, the TTD will hand over the new Pilgrims Amenities Complex to Karnataka Government

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో వసతి సముదాయాల నిర్మాణనికి నిర్ణయం

* క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రితో టిటిడి ఛైర్మ‌న్ స‌మావేశం

తిరుపతి, 2020 జూలై 03: తిరుమలలోని కర్ణాటక చారిటీస్ కు టీటీడీ లీజుకు ఇచ్చిన స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ నిర్ణయం తీసుకున్నాయి.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప‌తో శుక్ర‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి , ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈ ఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి బెంగుళూరులో సమావేశమయ్యారు.

తిరుమ‌ల‌లోని 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి టీటీడీ 2008లో కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం ప‌నులు చేప‌ట్టేందుకు టిటిడి అనుమ‌తి కోరుతూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఒక ప్లాన్‌ను స‌మ‌ర్పించింది. దీనిపై క‌ర్ణాట‌క దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి ఎఎస్‌.రోహిణి సింధూరి ఇటీవ‌ల టిటిడి ఛైర్మ‌న్‌ను క‌లిసి చ‌ర్చించారు. అనంత‌రం ఛైర్మ‌న్ క‌ర్ణాట‌క సత్రాల ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు బెంగ‌ళూరుకు రావాల్సిందిగా సిఎం శ్రీ య‌డ్యూర‌ప్ప టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవోల‌ను ఆహ్వానించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం వీరు సిఎంతో స‌మావేశ‌మయ్యారు. క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో కొత్త‌గా నిర్మించ‌త‌లపెట్టిన నూతన వసతి సముదాయం టీటీడీ నిబంధనల మేరకు నిర్మించడానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. ప్రధానంగా పడమర మాడ వీధి వైపు 1.94 ఎకరాల భూమిని బ్రహ్మోత్సవాలు, ఇతర సమయాల్లో భక్తుల అవసరాల కోసం ఖాళీగా ఉంచి మిగిలిన భూమిలో నిర్మాణాలు చేసుకోవడానికి అంగీకారం కుదిరింది.. కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్లాన్ ను టీటీడీ కి సమర్పిస్తుంది. దీన్ని టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోదించాక కర్ణాటక ప్రభుత్వం రూ.200 కోట్లు టీటీడీకి డిపాజిట్ చేస్తుంది. అనంతరం కర్ణాటక సీఎం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేస్తారు. టీటీడీ ఈ భవనాలు నిర్మించి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించేలా అవగాహన కుదిరింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.