VIKHANASA MAHARSHI JAYANTI HELD _ తిరుమలలో ఘనంగా శ్రీ విఖ‌నస మహర్షి జయంతి

Tirumala, 19  August 2024: The doyen of Vaikhanasa Agama, Sri Vikhanasa Maharshi Jayanti was observed in Tirumala on Monday.

Under the joint aegis of TTD Alwar Divyaprabandha Project and Sri Vaikhanasa Divya Sidhanta Vivardhini, the program was held at Astana Mandapam.

Many stalwarts spoke on the great works of Sage Vikhanasa on the occasion.

Representatives from the Vikhanasa Trust, TTD and Vedic scholars were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీ విఖ‌నస మహర్షి జయంతి

తిరుమ‌ల‌, 2024 ఆగస్టు 19: భార‌తీయ సంస్కృతికి వైఖాన‌స ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణ‌మ‌ని శ్రీ విఖ‌నస మహర్షి జయంతి స‌భ‌లో పండితులు ఉద్ఘాటించారు. తిరుమలలో సోమవారం శ్రీ విఖ‌నస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండ‌పంలో టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు ప్రసంగిస్తూ, ఆగమాలలో అతి ప్రాచీనమైన‌ది వైఖానస ఆగ‌మ‌మని ఇందులో చెప్పబడ్డ విధివిధానాలు మనవ‌ మనగడకు, సోపానానికి ఎంతో ఉప‌యోగ‌మ‌ని వైఖాన‌స‌క‌ల్ప సూత్రంలో ఉప‌దేశించార‌ని చెప్పారు. ఈ వైదిక విధానం మ‌రెక్క‌డ చెప్ప‌బ‌డ‌లేద‌ని, ఇది అత్యంత వేదోక్త వైఖానస సిద్దాంత‌మ‌ని వివ‌రించారు.

శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ కోశాధికారి శ్రీ సనత్ కుమార్ మాట్లాడుతూ, అనేక వేద మార్గ విధివిధానాల‌తో వైఖానస సిద్ధాంతం, వైఖాన‌స‌క‌ల్ప సూత్రం శ్రీ విఖ‌నోమునీంద్రుల‌చే తీర్చిదిద్దబడిందన్నారు. వైఖానస గ్రంధాల అధ్యయనం ప్రతి ఒక్కరు చేసి జ్ఞాన మార్గ‌ల‌ను అనుష్టించి వైదిక మార్గంలో న‌డ‌వాల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉన్న‌ద‌ని వివరించారు.

అనంతరం పలువురు వేద పండితులు విఖ‌నస మహర్షి రచనలపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.