తిరుమలలో డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం

తిరుమలలో డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం

తిరుపతి, నవంబర్‌-05,2009: నవంబర్‌ 6వ తేదిన తిరుమలలో ఉదయం 8.30 నుండి 9.30ని||ల వరకు డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం నిర్వహిస్తారు.

భక్తుల సౌలభ్యం కొరకు త్వరితగతిన స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన శీఘ్రదర్శనం భక్తుల ప్రశంసలను అందుకుంటున్న విషయము విదితమే. కనుక భక్తులు రేపటి డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమంలో ‘శీఘ్రదర్శనం’ అను అంశపై తమ విలువైన సూచనలను  ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.