EXTENSIVE ARRANGEMENTS FOR DHARMIC SADAS AT TIRUMALA-TTD EO _ తిరుమలలో ధార్మిక సదస్సుకు విస్తృత ఏర్పాట్లు-⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirumala, 05 January 2024: TTD EO Sri AV Dharma Reddy has directed officials to make extensive arrangements towards the smooth conducting of the three-day-long Dharmic Sadas being organised by the Hindu Dharma Prachara Parishad wing of TTD at Asthana Mandapam in Tirumala from February 3 to 5.

Addressing a review meeting at Annamaiah Bhavan on Friday the EO instructed officials to invite all the pontiffs across the country and organise them Srivari Darshan, accommodation and transport facilities for them in a smooth manner.

He said the suggestions and directives of religious heads will be crucial in pursuing Sanatana Hindu Dharma Pracharam.

He also urged officials to coordinate and set up several committees with senior officials to roll out arrangements.

TTD JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, one of the chief priests of Tirumala temple Sri Venugopal Dikshitulu, CE Sri Nageswar Rao, HDPP Secretary  Sri Somayajulu, Program Officer Sri Rajagopal, Annamacharya Project Director Dr A Vibhishana Sharma, Dharmagiri Veda Vijnana Peetham Principal Sri Kuppa Shiva Subrahmanya Avadhani and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ధార్మిక సదస్సుకు విస్తృత ఏర్పాట్లు-⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 05: తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా ఏర్పాటు చేయాలన్నారు. సదస్సులో స్వామీజీల సూచనలు, సలహాల మేరకు సనాతన హైందవ ధర్మ ప్రచారంకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.

అనంతరం సదస్సు నిర్వహణకు సీనియర్ అధికారులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఈవో సమీక్షించారు.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, సిఈ శ్రీ నాగేశ్వరరావు, డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కుప్ప శివ సుబ్రహ్మణ్యం అవధాని తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.