DEVOTEES APPRECIATE TTD ON VAIKUNTHA DWARA DARSHAN ARRANGEMENTS _ టీ దుకాణాల్లో మట్టి గ్లాసులు వినియోగించేలా అవగాహన- డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TIRUMALA, 05 JANUARY 2024: Devotees poured in appreciation of the arrangements made by TTD for the ten-day Vaikunthadwara Darshanam from December 23 to January 1 for providing them hassle-free darshan.
Among the 26 callers who interacted with the TTD EO Sri AV Dharma Reddy during the live phone in programme Dial your EO held at Annamaiah Bhavan in Tirumala on Friday, many of them expressed their happiness on darshan arrangements. Devotees Sri Giranna from Adoni, Sri Jagan from Hyderabad, Sri Purushottam from Guntur lauded TTD EO and his team of officials over the arrangements.
While a few callers informed the EO that they were forced to stand in queue lines instead of making them sit in the compartments although they were vacant. Reacting to their feedback, the EO said, he will immediately check with the concerned over the issue and instruct that such things are not repeated in future.
Some pilgrim callers brought to the notice of EO over the non-functioning of Geysers in many rest houses which was also addressed by EO by instructing the concerned officers then and there itself to rectify the defects immediately.
When Sri Satya Rao from Vizianagaram sought EO to give Rs.300 tickets offline, he said it is not possible as the online system has been stabilized now.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీ దుకాణాల్లో మట్టి గ్లాసులు వినియోగించేలా అవగాహన
– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు
తిరుమల, 2024 జనవరి 05: తిరుమల పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా టీ దుకాణాల్లో మట్టిగ్లాసులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని టీటీడ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.
1. శ్రీ ప్రసాద్ – హైదరాబాద్
ప్రశ్న : 300 రూపాయల క్యూలైన్ లో దర్శనానికి వెళ్ళాము. ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయండి. వెండి వాకిలి వద్ద తోపులాట అధికంగా జరుగుతోంది. శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద మెట్లు దిగే క్రమంలో జారిపడే ప్రమాదం ఉంది.
ఈవో : అధికారులు సమన్వయం చేసుకొని క్యూలైన్ లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. వెండి వాకిలి వద్ద నెమ్మదిగా వెళ్లాలని భక్తులకు సూచనలు ఇస్తున్నాం. నడకమార్గాల్లో గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మూడు ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నాయి. శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయ మెట్ల వద్ద జారకుండా తగిన ఏర్పాట్లు చేస్తాం.
2. శ్రీమతి దీప్తి – రాజమండ్రి
ప్రశ్న : డిసెంబరు నెలలో దాతల విభాగంలో బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్నాం. తుఫాన్ కారణంగా రాలేకపోయాము. తిరిగి దర్శనం కల్పించండి.
ఈవో: మీకు ఫోన్ చేసి వివరాలు తీసుకొని తిరిగి దర్శనం ఏర్పాటు చేస్తాం.
3. శ్రీ ఆనంద్ – చెన్నై
ప్రశ్న : సీనియర్ సిటిజన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించండి.
ఈవో : పరిశీలిస్తాం.
4. శ్రీ కిరణ్ – హైదరాబాద్
ప్రశ్న : శ్రీవారి సేవ వెబ్సైట్లో లడ్డు ప్రసాద సేవ బుక్ చేసుకునే అవకాశం ఉందా?
ఈవో : లడ్డూ ప్రసాద సేవ ప్రస్తుతానికి లేదు.
5. శ్రీమతి అనూరాధ – నాయుడుపేట
ప్రశ్న : తిరుమలలో పావురాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా శ్వాస సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీవారి చరిత్రపై పుస్తకాలను అందుబాటులో ఉంచండి.
ఈవో: తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో తిరుమల శ్రీవారి గురించిన పలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పావురాల సమస్యను పరిశీలిస్తాం
6. శ్రీమతి లలిత – కర్నూలు
ప్రశ్న : 300 రూపాయలు టికెట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చాము. సర్వదర్శనం భక్తులను, మమ్మల్ని కలిపి ఒకటేసారి వదలడం వల్ల క్యూలైన్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డాము.
ఈవో : వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో 300 రూపాయలు దర్శనం టికెట్లు కలిగిన భక్తుల క్యూలైన్, సర్వదర్శనం భక్తుల క్యూలైన్ కలుస్తుంది. క్యూలైన్ లో ఇబ్బందులు లేకుండా చూస్తాం.
7. శ్రీ శ్యాంప్రసాద్ – హైదరాబాద్
ప్రశ్న : వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్ లో సరిగా బుక్ కాలేదు.
ఈవో : మొత్తం 6.47 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకొని దర్శనానికి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేవు.
8. శ్రీ జగన్ – హైదరాబాద్
ప్రశ్న : వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు బాగున్నాయి. అంజనాద్రి కాటేజీలో గీజర్ పనిచేయలేదు. అన్నదానంలో పరిశుభ్రత సరిగా లేదు. వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయలేదు.
ఈవో: గీజర్ల సమస్యను పరిష్కరిస్తాం. అన్నదానంలో పరిశుభ్రతను పెంచేలా సిబ్బందికి సూచనలు ఇస్తాం. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయలేదు. సాధారణ రోజుల్లో వీరికి ప్రత్యేక క్యూలైన్ ఉంటుంది.
9. శ్రీ మహేష్ – మహబూబ్‌నగర్
ప్రశ్న : జిఎన్‌సీలో గది తీసుకున్నాము. కాషన్ డిపాజిట్ తిరిగి రాలేదు.
ఈవో : ఒక వారం రోజుల్లో కాషన్ డిపాజిట్ తిరిగి భక్తుల ఖాతాకు జమ అవుతుంది. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ సరిగా లేకపోతే సమస్య వస్తుంది. మీతో మాట్లాడి కాషన్ డిపాజిట్ తిరిగి వచ్చేలా చూస్తాం.
10. శ్రీ నాగేశ్వరరావు -హైదరాబాద్
ప్రశ్న: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మోహినీ అలంకారంలో అమృతకలశం అలంకరించడంలేదు.
ఈవో : ఈ విషయాన్ని ప్రధానార్చకులు, జీయ్యంగార్ల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతాం.
11. శ్రీ పురుషోత్తం – గుంటూరు
ప్రశ్న: తిరుమలలో టీ దుకాణాల్లో మట్టి గ్లాసులు వినియోగించేలా చర్యలు తీసుకోండి.
ఈవో : తిరుమలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులను వినియోగిస్తున్నాం. టీ స్టాళ్ల యజమానులతో చర్చించి మట్టి కప్పులు వినియోగించేలా అవగాహన కల్పిస్తాం.
12. శ్రీ శ్రీనికేతన్ – చెన్నై
ప్రశ్న : నాకు 65 ఏళ్లు. సీనియర్ సేవకునిగా రావచ్చా?
ఈవో : మీరు సీనియర్ సేవకునిగా నమోదు చేసుకుని రావచ్చు.
13. శ్రీ రవికాంత్ – బళ్లారి
ప్రశ్న : ఆన్‌లైన్‌లో ఒక కళ్యాణోత్సవం టికెట్ బుక్ అయింది. నా కుటుంబ సభ్యులకు మరో కల్యాణోత్సవం టికెట్ టెక్నికల్ సమస్య వల్ల బుక్ కాలేదు.
ఈవో : ఆన్‌లైన్‌తోపాటు తిరుమలలో లక్కీడిప్ ద్వారా లేదా విచక్షణ కోటాలో కల్యాణోత్సవానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
14. శ్రీ వెంకట్ – పిఠాపురం
ప్రశ్న : లడ్డూలో చక్కెర శాతం ఎక్కువగా ఉంది. రుచి తగ్గింది. తిరుమల పరిశుభ్రత సరిగా లేదు.
ఈవో : లడ్డూ నాణ్యత గురించి పోటీ సిబ్బందికి తరచూ సూచనలు ఇస్తున్నాం. నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తున్నాం. రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాం. తిరుమలలో పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
15. శ్రీ ప్రేమ్ కుమార్ – హోసూర్
ప్రశ్న: క్యూ లైన్లలో చిన్న పిల్లలకు పాలు ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఎస్ఎస్‌డి టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు తొందరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోండి. వైకుంఠం కంపార్ట్మెంట్లలో సలహాలు సూచనలకు ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేయండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయండి.
ఈవో : సంవత్సరంలోపు చంటి పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంపార్ట్‌మెంట్లలో పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంది. క్యూలైన్లలో వీలు కాదు. ఎస్ఎస్‌డి టోకెన్లు కలిగిన భక్తులకు రెండు నుండి మూడు గంటల్లో దర్శనం అవతుంది. ఎస్ఎస్‌డి, ఎస్ఇడి టోకెన్లు కలిగిన భక్తులను వైకుంఠం – 1 వద్ద కలిపి వదులుతారు. రెండు క్యూ లైన్లు సాధ్యం కాదు. కంపార్ట్మెంట్లలో సలహాలు సూచనలకు బాక్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఫోన్ సౌకర్యం కూడా ఉంది. ముగ్గురు ఆఫీసర్లను క్యూలైన్ల వద్దకు పంపి భక్తుల సమస్యలు తెలుసుకుంటాం.
16. శ్రీ రంగనాథన్ – బెంగళూరు. శ్రీ శ్రీనివాస్ – మెదక్
ప్రశ్న : ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు కలిగిన భక్తులు రాలేకపోతే వాయిదా వేసుకునే అవకాశం కల్పించండి.
ఈవో : వాయిదా వేసుకునే అవకాశం లేదు, దర్శనానికి రాలేని పక్షంలో టికెట్లు రద్దు అవుతాయి. భక్తులు తిరుపతిలో ఎస్ఎస్‌డి టోకెన్లు, సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
17. శ్రీ బాబురావు – గుంటూరు
ప్రశ్న : శ్రీ లక్ష్మీనరసింహన్ తిరుప్పావై ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి. వీరితో రామాయణం, భాగవతం లాంటివి చెప్పిస్తే బాగుంటుంది.
ఈవో : వారి సేవలు వినియోగించుకుంటాం.
18. శ్రీ మురళి – బెంగళూరు
ప్రశ్న : శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచాలి. శ్రీవారి సన్నిధిలో భద్రతా సిబ్బంది లాగేస్తున్నారు.
ఈవో : తిరుమలలో క్యూ లైన్లు చాలా సంవత్సరాలుగా ఇదేవిధంగా నిర్వహిస్తున్నాం. భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను విధిగా తనిఖీ చేయాలి. బంగారు వాకిలి వద్ద మూడు వరుసల క్యూ లైన్ చాలా చక్కగా ఉంది. శ్రీవారి మహిళా సేవకులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ 80 వేల మంది కంటే ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. కావున బయట వేచి ఉండే వారి సమయం తగ్గించాలి.
19. శ్రీమతి ముని లక్ష్మి – నెల్లూరు
ప్రశ్న : రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం బుక్ చేసుకున్న వారు రాలేకపోతే రద్దవుతోంది. అటువంటి వారికి 30 రోజుల్లోపు తిరిగి దర్శనం టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించండి. హోమంలో పాల్గొనే గృహస్తుల పిల్లలకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వాలి. కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నా క్యూలైన్లలో గంటల తరబడి నిలబెడుతున్నారు. ఎస్ఎస్‌డి టోకెన్లు అప్డేట్స్ టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. టీటీడీ కాల్ సెంటర్ నుండి వారానికి ఒకసారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సంబంధిత విభాగాల హెచ్ఓడీలకు పంపించాలి. టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై వెంటనే కాల్ సెంటర్ పూర్తి సమాచారం అందిస్తే లక్షలాది మంది భక్తులకు సమాచారం అందుతుంది. వసతి గృహాల్లో గీజర్లు పనిచేయడం లేదు. శ్రీవారి దర్శనానికి వచ్చే మహిళలు పూలు పెట్టుకొని రాకూడదనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయండి. వసతి గృహాల వద్ద అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది.
ఈవో : హోమంలో పాల్గొనే భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. కాల్ సెంటర్‌కు పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకుంటాం. కాల్ సెంటర్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. అన్ని గదులలో గీజర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. తిరుమలలో పూలు పెట్టుకొని రాకూడదని భక్తులలో మరింత అవగాహన పెంచుతాం.
20. శ్రీ గిరన్న – ఆదోని
ప్రశ్న : ఎస్ఎస్‌డి టోకెన్లతో వైకుంఠ ఏకాదశి దర్శనం చాలా బాగుంది. సప్తగిరి వసతి గృహాలలో గీజర్లు పనిచేయడం లేదు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి క్యూలైన్ లలో ఎక్కువ సమయం వేచి ఉండవలసి వచ్చింది.
ఈవో : సప్తగిరి వసతి గృహాలను ఆధునీకరిస్తాం. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులలలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకున్నాం.
21. శ్రీ సత్యారావు – విజయనగరం
ప్రశ్న : టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లలో దర్శనం టికెట్లు ఇవ్వడం చాలా సౌకర్యంగా ఉండేది. దానిని పునరుద్ధరించండి. ఆన్‌లైన్‌లో ఇబ్బందిగా ఉంది.
ఈవో : గతంలో 20 నుండి 25 ప్రాంతాల్లో కోటా పద్ధతిలో ఈ-దర్శన్ కౌంటర్లలో దర్శనం టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కావున ఆన్‌లైన్‌లోనే సౌకర్యంగా ఉందని భక్తులు విజ్ఞప్తి చేశారు. మార్చడం వీలుకాదు.
22. శ్రీ సునీల్ – అనంతపురం
ప్రశ్న: అక్టోబర్‌లో సప్తగిరి మాసపత్రికకు చందా కట్టాను. ఇంతవరకు అందలేదు.
ఈవో : సత్వరం అందేలా చర్యలు తీసుకుంటాం.
23. శ్రీ ప్రసాద్ – బెంగళూరు
ప్రశ్న : గత నెల 20వ తేదీ తిరుమలలో గదిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం. 7.30 గంటలకు వస్తే టైం అయిపోయిందన్నారు. కరెంటు బుకింగ్‌లోనూ ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడ్డాం.
ఈవో : ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.