తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే ఛైర్మెన్
తిరుమలలో పలు ప్రాంతాలను తణిఖీ చేసిన తి.తి.దే ఛైర్మెన్
తిరుమల, 19 జూలై 2013 : తిరుమలలో శుక్రవారంనాడు ఉదయం తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు పలు ప్రాంతాలను ఆకస్మిక తణిఖీచేశారు.
ఇందులో భాగంగా ముందుగా ఆయన ముళ్ళకుంట, రాంభగీచా, టి.బి.సి, ఆదిశేషు అతిథి భవనం ప్రాంతాలను తణిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఆర్కిటెక్ట్ పద్మశ్రీ కె.ఎల్.నారాయణరావు గారిచే తిరుమలలో పార్కింగ్ స్థలాలు, శ్రీవారిసేవకుల కొరకు వసతి భవనం నిర్మాణాకృతులను పూర్తి ఉచితంగా డిజైన్ చేయించనున్నామన్నారు.
కాగా ముళ్లకుంట మరియు రాంభగీచా చెంత ఉన్న ఖాళీ ప్రాంతంలో విశాలమైన వాహన పార్కింగ్ స్థలాన్ని, అదే విధంగా పాపవినాశం మార్గంలో శ్రీవారి సేవకుల కొరకు భవన నిర్మాణాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారిసేవ భవన నిర్మాణం పనులు రెండు విడతలుగా చేపడతామని, అందులో భాగంగా 5000 మందికి సరిపడా విధంగా ఈ భవనం అన్ని సదుపాయాలతోనూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేసి రానున్న బోర్డు సమావేశంలో నివేదికను సమర్పించాల్సిందిగా ఆయన ఇంజనీరింగ్ అధికారులను సూచించారు.
ఈ తణిఖీలో సి.ఇ. శ్రీ చంథ్రేఖర్ రెడ్డి, ఎస్.ఇ.2 శ్రీ రమేశ్‌రెడ్డి, అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.