UNPRECEDENTED RUSH IN TIRUMALA _ తిరుమలలో భక్తజన సందోహం
* SRIVARI DARSHAN TAKING 48 HOURS
* DEVOTEES URGED TO REDO THEIR TIRUMALA YATRA PLANS
Tirumala, 28 May 2022: Unprecedented pilgrim rush is being witnessed in Tirumala on Saturday with an ocean of devotees thronging Hill Town.
The influx of pilgrims is higher than the pilgrim rush during Vaikunta Ekadasi and Garuda Seva days and as a result Srivari Darshan is taking over 48 hours with all the queue lines and compartments brimming to their capacities.
As of now it was possible to give Srivari Darshan to only 4500 devotees per hour. But with the heavy rush to provide Darshan to all those in queue lines it takes two days.
The devotees are appealed by TTD to take a note of the present situation and change their pilgrimage plans accordingly to avoid any sort of inconvenience.
TTD EO INSPECTS DEVOTEES FACILITIES IN QUEUE LINES
Inspecting the queue lines on Saturday evening, the EO directed all the department officials to step up the facilities for the devotees.
He said elaborate arrangements of drinking water, milk, Anna Prasadam etc. are being made and TTD Security with the co-ordinated efforts of Police ensured safety measures to devotees.
Officials of all departments were present during EO inspection tour.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుమలలో భక్తజన సందోహం
– శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటలు
– ఈ మేరకు భక్తులు తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలి : టిటిడి
తిరుమల, 2022 మే 28: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది.
భక్తుల క్యూలైన్ల తనిఖీ
టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలో భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని ఈఓ తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు.
ఈఓ వెంట అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.