ALL SET FOR ANNUAL SRIVARI TEPPOTSAVAM FROM MARCH 5-9 _ తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం
Tirumala, 4 March 2020: TTD has made all arrangements for the annual five day event of Srivari Teppotsavams at Tirumala from March 5 to 9 in a grand manner in the temple tank of Swamy Pushkarini.
Every year on the day Phalguna Ekadasi, the float festival is celebrated on a grand scale in the Swami Pushkarini for five days in the month of Chaitra (March-April) and concludes on Phalguna Pournami day on March 9.
TTD has allocated 2.5 tonnes of flowers worth Rs 5 lakhs and electrical decorations for the majestic float festival. Similarly TTD is putting up Huge LED screens all around swamy Pushkarani at Rs 4 lakhs to give devotees a grand and colourful view of Teppotsavams.
The TTD water works have also filled up the Pushkarani with clean water and teams of experienced swimmers also kept in readiness to tackle all emergency situations if any.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం
తిరుమల, 2020 మార్చి 04: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 5వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరించనున్నారు.
ఇందులో భాగంగా తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. దాదాపు రూ.5 లక్షలతో 2.5 టన్నుల పుష్పాలతో తెప్పోత్సవాలు జరిగే 5 రోజుల పాటు పుష్పాలంకరణ చేయనున్నారు. తెప్పోత్సవాలను భక్తులు తిలకించేందుకు వీలుగా రూ.4 లక్షలతో పుష్కరిణికి నాలుగు వైపులా ఎల్ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా టిటిడి వాటర్ వర్స్క్ ఆధ్వర్యంలో పుష్కరిణిలోని నీటిని శుభ్రంచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కరిణి వద్ద గజ ఇతగాళ్ళను ఏర్పాటు చేశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామివారి తెప్పోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 5న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 6న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తారు.
ఇక మూడవరోజు మార్చి 7న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 8న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 9వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.