తిరుమల అతిథి గృహాల వసతి విరాళ పథకం

తిరుమల అతిథి గృహాల వసతి విరాళ పథకం

తిరుమ‌ల‌, 2010 జూన్‌ 24: తిరుమలలో నిర్మితమైన కౌస్తుభం  మరియు పాంచజన్యం అతిథి గృహంలో పదిలక్షల విరాళం చెల్లించిన దాతలు ఎవరికైనా వసతి కోసం ఒక గదిని తమపేరు మీద గాని, భార్య పేరు మీద గాని, సంయుక్తంగా గాని, సంస్థల పేరు మీద గాని సంవత్సరంలో 30 రోజులు మాత్రం వినియెగించుకునే అవకాశం కల్పించబడుతుంది.

సదరు సౌకర్యం కోసం దాతలు 10,00,000-00 (రూపాయలు పదిలక్షలు మాత్రమే) విరాళంగా తి.తి.దేవస్థానం వారికి చెల్లించవలసి ఉంటుంది. విరాళం చెల్లించిన దాతకు తన జీవిత కాలంలో కేవలం 20 సంవత్సరాల వరకు మాత్రమే ఈ వసతి సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

సాధారణ నిబంధనలుః-

18 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల పేర్ల మీద మాత్రమే ఈ విరాళాలు అంగీకరింపబడుతాయి. మైనర్ల పేర్ల మీద విరాళాలు స్వీకరించబడవు. దాతలు తమ డిమాండ్‌ డ్రాఫ్టుతో పాటు ఈ క్రింది సమాచారాన్ని జతపరుచవలసి ఉంటుంది.

1. దాతకు ఫోను ఉన్నట్లు అయితే నంబరుతో పాటు పూర్తి పేరు చిరునామా.
2. అతిథిగృహం పేరు అది ఉన్న స్థలం.
3. విరాళం నగదు మొత్తం – డి.డి.నెం – కట్టిన తేది.
4.విరాళం వ్యక్తిగతమా/సంయుక్తమా/సంస్థకు చెందినదా.

గమనికః- తి.తి.దే నిబంధనలు మరియు షరత్తులు వర్తిస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.