తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం
తిరుమల, మార్చి-24, 2009: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదిన ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మార్చి 27 నుండి మే నెల 5వ తేది వరకు 40రోజుల పాటు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం సందర్భంగా ఆర్జితసేవలైన తోమాల, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలను రద్దు చేశారు. ఇదే రోజున ఉదయం 9గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా శ్రీవారిఆలయంలో ఉదయం 6గంటలకు బంగారువాకిలి వద్ద శ్రీమలయప్పస్వామి వారికి, ఉభయనాంచారులకు, సేనాధిపతి వారికి విశేష సమర్పణ నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుండి 9గంటల మద్య ఆలయంలో విశేషపడి, విశేషనూతన వస్త్రముల ఊరేగింపు, పంచాంగశ్రవణం, బంగారువాకిలి వద్ద ఆస్థానం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.