NO HURDLES FOR DEVOTEES TO VISIT TIRUMALA- TTD EO _ తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు – విరిగిన కొండచరియలను పరిశీలించిన చెన్నై ఐఐటి నిపుణులు – టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
– CHENNAI IIT EXPERTS INSPECTED LAND SLIDES
Tirumala, 1 Dec. 21: TTD EO Dr KS Jawahar Reddy has asserted that there were no hurdles for devotees to visit Tirumala for Srivari darshan.
In a statement on Wednesday, the TTD EO said there were fresh land slides between 13 &15 kms on second ghat roads but works were underway on war footing to remove debris and resume traffic on the route. All the boulders and debris will be cleared by evening.
He said the first ghat road is opened up and nearly 2300 vehicles came to Tirumala and another 2000 vehicles went down to Tirupati till 4.00 pm today,
He said the Chennai IIT experts inspected the landslide spots and the Delhi IIT experts are arriving on Thursday. TTD will begin other works after studying the detailed report by the IIT experts.
He said the engineering, vigilance, health departments were directed to be alert and ensure that devotees did not face any hurdles on ghat roads.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు
– విరిగిన కొండచరియలను పరిశీలించిన చెన్నై ఐఐటి నిపుణులు
– టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, 01 డిసెంబరు 2021: తిరుపతి – తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండో ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం లోపు బండరాళ్లు, మట్టిని పూర్తిగా తొలగిస్తారని ఈఓ తెలియజేశారు. మొదటి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని, సాయంత్రం 4 గంటల వరకు తిరుపతి నుండి తిరుమలకు 2,300 వాహనాలు, తిరుమల నుండి తిరుపతికి 2,000 వాహనాలు ప్రయాణించాయని వివరించారు. చెన్నై ఐఐటి ప్రొఫెసర్లు తిరుమలకు చేరుకుని విరిగిపడిన కొండచరియలను పరిశీలించారని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్లు గురువారం ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. ఐఐటి నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలించి సమర్పించే నివేదిక తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఈఓ వివరించారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్, సెక్యూరిటి, ఫారెస్టు, ఆరోగ్య విభాగం తదితర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఈఓ ఆదేశించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.