ARADHANA MAHOTSAV OF SRI VYASARAJA AND SRI VADIRAJA BEGINS AT TIRUMALA _ తిరుమలలో శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు ప్రారంభం
Tirumala, 20 Mar. 22: The Aradhana Mahotsav of prominent Karnataka music Dasa pontiff’s Sri Vyasaraja Thirtha and Sri Vadiraja Thirtha grandly began at Asthana Mandapam at Tirumala on Sunday
Speaking on the occasion Dasa Sahitya project OSD Sri Ananda Thirtha Charyulu said Sri Vyasaraja thirtha, a Raja guru of Vijayanagar emperor Sri Krishnadevaraya had trained thousands of Veda pundits and propagated Dasa Sahitya. The pontiff had also penned thousands of sankeertans on Sri Venkateshwara during his 12-year stay at Tirumala.
Similarly, Sri Vadiraja thirtha, a disciple of Sri Vyasaraja, was an exponent of Dwaita philosophy and after a visit to pilgrim centres all over India had scripted the epic Thirtha Prabandam.
As part of celebrations, 300 artists of the Dasa Sahitya project from AP, Karnataka and Telangana are performing parayanams of sankeetans of both saints on March 20-21.
The DS project official said the Mahotsavam fete will conclude on March 22 mornings after suprabatham abs Bhakti sangeet parayanams.
Dasa Sahitya project artists and TTD officials were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు ప్రారంభం
తిరుమల, 2022 మార్చి 20: ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలైన శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థులవారి ఆరాధనా మహోత్స వాలు తిరుమల ఆస్థాన మండపంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయుల రాజగురువైన శ్రీ వ్యాసరాజ తీర్ధులు హంపిలో వెయ్యిమంది పండితులకు విద్యాబుద్ధులు నేర్పుతూ దాస సాహిత్యానికి విశేష కృషి చేశారన్నారు. శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు 12 సంవత్సరాలు తిరుమల క్షేత్రంలో ఉండి శ్రీవారిని అర్చిస్తూ వేలాది సంకీర్తనలు రచించారని చెప్పారు.
అదేవిధంగా శ్రీ వ్యాసరాజ యతీశ్వరుల వద్ద శ్రీ వాదిరాజ తీర్థులు శిష్యరికం చేశారన్నారు. ఆయన మధ్వాచార్యుల ద్వైత తత్వశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధ పండితుడు, తత్వవేత్తలలో ఒకరన్నారు. శ్రీ వాదిరాజ తీర్థులు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శంచి తీర్థ ప్రబంధమనే గ్రంథాన్ని రచించారని వివరించారు.
ఇందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి దాదాపు 300 మంది దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులు మార్చి 20, 21వ తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల సంకీర్తనలు పారాయణం చేస్తారన్నారు.
మార్చి 22న ఉదయం సుప్రభాతం, భక్తి సంగీత కార్యక్రమాలతో ఆరాధన మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.