తెప్పపై శ్రీరామచంద్రమూర్తి అభయం

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి అభయం

 తిరుపతి, ఏప్రిల్‌  24, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం స్వామివారు ఏడుచుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రకాలతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6.00 గంటలకు సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. 25వ తేదీ చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు జరగాల్సిన తెప్పోత్సవాన్ని ఏప్రిల్‌ 26వ తేదీన నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై,   సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.