CHANDIKESWARA AND CHANDRASEKHARA BLESS DEVOTEES _ తెప్పలపై శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి విహారం
TIRUPATI, 05 JANUARY 2023: On the fourth day evening of the ongoing annual Teppotsavams in Sri Kapileswara Swamy temple at Tirupati, Sri Chandikeswara Swamy along with Sri Chandra Sekhara Swamy blessed the devotees on the finely decked float on Thursday evening.
Temple officials and devotees participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పలపై శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి విహారం
తిరుపతి, 5 జనవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం సాయంత్రం శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి కపిల తీర్థం లోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వార్లు పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది