తిరుపతిలో చిక్కుకున్న భక్తులకు వసతి ఏర్పాటు _ దర్శనానికి వెళ్లలేని భక్తులకు వర్షాలు తగ్గాక అనుమతి : టీటీడీ
తిరుపతిలో చిక్కుకున్న భక్తులకు వసతి ఏర్పాటు
తిరుపతి 18 నవంబరు 202: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతి లో చిక్కుకు పోయిన భక్తులకు వసతి ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. వసతి కోసం ఇబ్బందులు పడుతున్న భక్తులు తిరుపతి లోని శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాలకు వెళితే సిబ్బంది వసతి ఏర్పాటు చేస్తారు.
దర్శనానికి వెళ్లలేని భక్తులకు వర్షాలు తగ్గాక అనుమతి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కలిగి ఉండి భారీ వర్షాల కారణంగా వెళ్లలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది