ENTRY TO TIRUMALA WITH SSD OR SED TICKETS AND COVID VACCINATION OR TEST REPORTS- TTD _ దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతి – కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
Tirumala, 04 October 2021: Ahead of Srivari annual Brahmotsavam, TTD on Monday reiterated that as part of the Covid pandemic, only devotees with SSD tokens /SED tickets along with valid vaccination certificates /Covid negative test reports shall be allowed to enter Tirumala.
In a statement, the TTD said that devotees without valid Certificates or 72 hours old Covid negative reports shall be stopped at Alipiri checkpoint itself and sent back.
Hence the devotees are appealed to come for Srivari Darshan with all adequate preparations and beget blessings of Sri Venkateswara without any hassle and co-operate with TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతి
– కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
తిరుపతి, 2021 అక్టోబరు 04: దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుందని, కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.
పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. కావున భక్తులు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.