ANNUAL FETE COMMENCES WITH DHWAJAROHANAM _ శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం
TIRUPATI, 26 MAY 2023: The annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati commenced with Dhwajarohanam on Friday in the auspicious Mithuna Lagnam.
The archakas performed Vishwaksena Aradhana, Vastu Homam, Garuda Linga Homam, Garuda Pratista, Raksha Bandhanam etc. before hoisting the Garuda flag on the temple pillar.
Both the senior and junior pontiffs of Tirumala, Kankanabhattar Sri Srinivasa Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu, DyEO Smt Shanti and other staff were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం
తిరుపతి, 2023 మే 26: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం 8.22 నుండి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.
అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.
అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం .
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, కంకణభట్టార్, శ్రీ ఎపి.శ్రీనివాసదీక్షితులు, ఆగమ సలహాదారులు, శ్రీ సీతారామాచార్యులు,
శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహన రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.