SRI GT ANNUAL UTSAVAM BEGINS WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 18 May 2021: The annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple commenced on Tuesday morning with the Dwajarohanam fete between 7.55am and 8.30 am in Mithuna lagnam amidst mangala vaidyam and Veda mantras followed by Srivari Asthanam.

SNAPANA TIRUMANJANAM:

As part of the first-day festivities of Brahmotsavams, Snapana Tiirumanjanam was performed to utsava idols.

 PEDDA SESHA VAHANA:

 In view of prevailing Covid guidelines, the first Vahana Seva of Pedda Sesha will be held in Ekantha in the temple premises on Tuesday evening.

Tirumala Pontiffs, Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Kankana Bhattar Sri AT Parthasarathy Dikshitulu and others staff were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 మే 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీవారి ఆస్థానం జరిగింది.

అంత‌కుముందు అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

స్నపన తిరుమంజనం –

ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంల‌తో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.

పెద్దశేష వాహనం –

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహన‌ సేవ‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మునీంద్ర‌బాబు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.