AP CM TO INAUGURATE SRINIVASA SETHU IN NOVEMBER _ నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

TTD CHAIRMAN REVIEWS WITH OFFICIALS

 Tirumala, 29 Oct 21: TTD Chairman Sri YV Subba Reddy has directed officials to complete all arrangements for the inauguration of the landmark Srinivasa Sethu by Honourable Chief Minister of AP Sri YS Jaganmohan Reddy by November and resolve the traffic hurdles of all pilgrims visiting Tirumala and also the citizens of pilgrim city of Tirupati.

The Chairman reviewed the status of construction works of the Srinivasa Sethu with TMC commissioner Sri Girisha, Representative of M/s Afcon Ltd Sri Rangaswamy at his camp office in Tirumala on Friday.

Speaking on the occasion he said since the flyover works were complete from RTC bus station to Kapilatheertham, all preparations shall be made for its inauguration and also directed officials to clear the dues payable to the construction company from TTD without any delay.

Later the Chairman told reporters that the CM had conceded the request of Tirupati MLA Sri B Karunakara Reddy and directed to complete pending works soon.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

– ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టు సంస్థకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశం

తిరుమల 29 అక్టోబరు 2021: తిరుపతి నగర ప్రజలు, యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నవంబరు నెలలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్ శ్రీ గిరీష, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి శ్రీ రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనుల పై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు వంతెన నిర్మాణ దాదాపుగా పూర్తయిందని చెప్పారు.దీన్ని ప్రారంభించ డానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి నుంచి కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన మొత్తం త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన పనులు నవంబర్ లోపు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను చైర్మన్ ఆదేశించారు.

అనంతరం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీనివాస సేతు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారని చెప్పారు.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి టిటిడి ని ఆదేశించారన్నారు. నవంబర్ లోగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు నిర్మాణం పూర్తి అయిన వారధిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.