LAKSHMI KASULU HARAM PROCESSION ON NOVEMBER 15 _ నవంబరు 15న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
Tirumala, 11 Nov. 20: In connection with annual Karthika Brahmotsavams at Tiruchanoor, the famous Lakshmi Kasula Haram at Tirumala will be decked to Goddess on the day of Gaja Vahanam on November 15.
As part of it, the Lakshmi Kasula Haram will be paraded along four mada streets on November 15 at Tirumala between 8am and 9am.
Later the Haram will be brought to Tiruchanoor and decked to during Gaja Vahana Seva procession.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 15న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
తిరుమల, 2020 నవంబరు 11: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 15న తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకెళ్లనున్నారు. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని ఉదయం 8 నుండి 9 గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు.
అనంతరం తిరుమల నుండి బయల్దేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆదివారం రాత్రి జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజ వాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.