KARTHIKA MAHA DEEPOTSAVAM AT TIRUPATI ON NOV 18 – TTD JEO ( E &H) _ న‌వంబ‌రు 18న తిరుప‌తిలో కార్తీక దీపోత్సవం-. ఏర్పాట్ల‌పై టీటీడీ జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి స‌మీక్ష

Tirupati, 16 November 2022: TTD JEO (E & H) Smt Sada Bhargavi on Wednesday directed officials to make extensive arrangements for the conduct of Karthika Deepotsavam at Tirupati on November 18.

Addressing a review meeting at the TTD administrative building, the JEO said the fete is aimed at imparting the significance of Deepotsavam and prayers to Sri Venkateswara Swamy and Sri Mahalakshmi for the well-being of humanity.

Seating Arrangements are being made for 1800 persons for the fete slated between 6.00pm to 8.00 pm on Friday and all women devotees participating in the Deepotsavam will be presented with a Tulasi sapling, she added.

The fete includes a dance ballet,  on Asta Lakshmi Vaibhavam , Lakshmi Niranjanam (lighting of Diyas), Nakshatra harati, mangala harati and Govinda Namas. She said this is the third one after Yaganti and Vizag Karthika Deepotsavams.

Among others, the JEO asked TTD PRO Dr T Ravi to depute adequate numbers of Srivari Sevaks, engineering officials to set up stage, barricades and other engineering works, grand flower and electrical decorations and LED screens in the Parade grounds of TTD apart from deploying additional sanitary workers for cleaning the area.

She also inspected the ongoing arrangements and made valuable suggestions to the officials concerned.

Tirumala Temple one of the Chief Archakas Sri Venugopala Dikshitulu, SVBC CEO Sri Shanmukh Kumar, SE-2 Sri Jagadeeshwar Reddy, SE(electrical) Sri Venkateswarlu, Transport GM Sri Sesha Reddy, Garden Deputy Director Sri Srinivasulu, Annadanam DyEO Sri Subramaniam, Annamacharya project Director Dr Akella Vibhishana Sharma, VGO Sri Manohar, additional health officer Dr Sunil Kumar and other officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబ‌రు 18న తిరుప‌తిలో కార్తీక దీపోత్సవం – ఏర్పాట్ల‌పై టీటీడీ జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి స‌మీక్ష‌

తిరుప‌తి, 2022 న‌వంబ‌రు 16: నవంబర్ 18వ తేదీ తిరుపతి టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్నివిజ‌య‌వంతంగా నిర్వ‌హించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై జెఈవో బుధ‌వారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులకు తెలిపేందుకు, దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. న‌వంబ‌రు 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు . మైదానంలో 1800 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. దీపోత్స‌వాన్నికి విచ్చేసే మ‌హిళ‌ల‌కు తులసి మొక్కలు అందివ్వాల‌న్నారు. అదేవిధంగా అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య రూపకం , సామూహిక ల‌క్ష్మీనీరాజ‌నం(దీపాలు వెలిగించడం)తో పాటు న‌క్ష‌త్ర హార‌తి, మంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

పిఆర్వో తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీర్ విభాగం స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజనీర్ పనులను ముందుస్తుగా పూర్తి చేయాల‌ని ఆమె సూచించారు. కార్తీక మాసం విశిష్టతను తెలియ‌జేసేలా స్టేజీపై సుంద‌రంగా పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, మైదానంలో ఎల్ఇడిలు స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అనంత‌రం జెఈవో అధికారుల‌తో క‌లిసి టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో దీపోత్సవ‌ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ‌ కుమార్, ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఎస్ఈ (ఎల‌క్టిక‌ల్‌) శ్రీ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, అన్నదానం డెప్యుటీ ఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డా.విభీష‌ణ శ‌ర్మ‌, విజివో శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.