PUSHPA YAGAM AT SRIVARI TEMPLE ON NOVEMBER 19 _ నవంబరు 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Tirumala, 17 November 2023: The annual Pushpayagam will be held at Srivari temple on November 19  with Ankurarpanam on November 18.

 

After the second Archana, second bell and Naivedyam in the morning of November 19 the utsava idols of Sri Malayappa Swami and His consorts will be brought to Kalyana Mandapam in Sampangi Pradakshina for Snapana Tirumanjanam.

 

Later in the afternoon, Pushpayagam is performed with a variety of flowers.

 

In view of  Ankurarpanam on November 18 TTD has cancelled Sahasra Deepalankara in the evening. Similarly, the Suprabatham, Tomala and Archana Sevas in the morning of November 18 will be held in Ekantham in view of Tirumala Sare being taken to Tiruchanoor for the Ammavari Panchami thirtha fete.

 

Cancellation of Arjita Sevas on November 19 

 

In view of the Pushpayagam fete on November 19, TTD has cancelled the arjita Sevas of Kalyanotsavam, Unjal Seva and Arjita Brahmotsavam as well the Tomala, Archana Sevas will be held in Ekantham only.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల, 2023 న‌వంబ‌రు 17: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 18న శ‌నివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవలు ర‌ద్దు

న‌వంబ‌రు 18న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పంచ‌మీతీర్థం సంద‌ర్భంగా తిరుమ‌ల నుండి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున‌ ఉద‌యం సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

న‌వంబ‌రు 19న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.