నవంబరు 24న డిసెంబరు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
నవంబరు 24న డిసెంబరు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
తిరుమల, 2022 నవంబరు 22: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబరు 24వ తేదీన ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.