BHAGAVAT GITA COMPETITIONS ON NOVEMBER 27 _ న‌వంబ‌రు 27న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

TIRUPATI, 28 OCTOBER 2022: The HDPP wing TTD will conduct Bhagavat Gita competitions in Annamacharya Kalamandiram in Tirupati on November 27 at 9am.

The students from class 6-9 belonging to schools in Tirupati shall participate. The competition will be conducted for 6&7 and 8&9 separately.

The winners will be presented with prizes on December 4 on the occasion of Gita Jayanthi.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 27న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

తిరుప‌తి, 2022 అక్టోబరు 28: టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో న‌వంబరు 27వ తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. టీటీడీ విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు.

ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 4వ అధ్యాయం (జ్ఞాన‌ యోగం)లో 6, 7వ త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను, 8, 9వ త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

అలాగే, భ‌గ‌వ‌ద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠ‌స్థం వ‌చ్చిన 18 సంవ‌త్స‌రాల లోపు వారికి జూనియ‌ర్స్‌గాను, అంత‌కుపైబ‌డిన వారికి సీనియ‌ర్స్ విభాగంగాను పోటీలు నిర్వ‌హిస్తారు. ఆస‌క్తిగ‌ల‌వారు న‌వంబ‌రు 27న ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య క‌ళామందిరంకు రావాల్సి ఉంటుంది . మ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643 నంబ‌రును సంప్ర‌దించాల్సి ఉంటుంది.

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 4వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.