SSD TOKENS FROM NOVEMBER 1 ONWARDS _ నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం

CHANGE IN VIP BREAK TIMINGS FROM DECEMBER 1

 

TTD TO COMMENCE BOTH ON TRIAL BASIS-TTD EO

 

TIRUMALA, 28 OCTOBER 2022: TTD will resume the issuance of SSD tokens from November 1 onwards and change in VIP Break Darshan timings from December 1 onwards on a trial basis, said TTD EO Sri AV Dharma Reddy.

 

During a media conference held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO said, TTD has stopped Slotted Sarva Darshan (SSD) tokens issuing system in Tirupati on April 12 early this year. However, TTD Board has resolved to restore the issuance of SSD tokens during last board meeting for the convenience of the pilgrims. The SSD tokens will be issued to devotees on day to day basis till the quota gets exhausted.

 

He said the tokens will be issued at Bhudevi Complex, Srinivasam and II NC in Tirupati. The counters with all facilities have been set up.

 

“On Saturdays, Sundays, Mondays and Wednesdays 20 thousands to 25 thousand tokens will be issued while on Tuesdays, Thursdays and Fridays only 15 thousand tokens will be allotted. Based on the existing pilgrim situation for the day, the discretion of increasing and decreasing the quota depends. If the SSD tokens quota exhausts for the day, the devotees can go to Vaikuntham Queue Complex 2 and wait in the compartments till their turn for Darshan”, EO maintained.

 

The EO also said, to reduce the waiting hours for common pilgrims, the Board has decided to change the VIP Darshan timings from early hours to 8am from December 1 onwards on a trial basis. This would benefit the darshan facility to more common pilgrims and also likely to reduce pressure on accommodation.

 

The SRIVANI ticket holders both in online and offline will be provided accommodation at Madhavam rest house in Tirupati”, he added.

 

Reception DyEO Sri Harindranath, temple Peishkar Sri Srihari were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం

– డిసెంబరు 1 నుంచి బ్రేక్ దర్శన సమయం ఉదయం 8 గంటలకు మార్పు

– డిసెంబరు 1 నుంచి శ్రీవాణి ట్రస్టు దాతలకు మాధవంలో గదులు

అక్టోబ‌రు 28, తిరుమల 2022: టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12న తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు వీటిని తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల రెండో సత్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుండి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏరోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లు అదేరోజు మంజూరు చేస్తామని, కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. ఈ కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్ నమోదు వ్యవస్థ, తాగునీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.

డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈఓ తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మాధవంలో గదుల బుకింగ్ అవకాశం

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈఓ తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తామన్నారు.

మీడియా సమావేశంలో డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.