ALL SET FOR GAJA VAHANA SEVA ON NOVEMBER 27 _ నవంబరు 27న తిరుచానూరులో గజవాహనం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఎంతో ప్రీతిక‌రం

Tiruchanoor, 26 Nov. 19: Legends and Pancharatra Agamas say that Gaja vahana, the divine elephant-Iravata with four tusks is a symbolic of four Vedas and favourite carrier of goddess Padmavathi.

As highlight of the ongoing Brahmotsavams Gaja vahanam will be held on Wednesday evening on November 27. 

Hence caparisoned elephants, horses, and bulls dominate all the vahana sevas of goddess Padmavathi during Brahmotsavams. Four elephants- Padmavathi (50), Vaishnavi (22), Srinidhi (17) are part of her entourage and on the auspicious Panchami thirtha day, Mahalakshmi (48) carries the saree from Srivari temple to Goddess Padmavati. Elephants are decked with Tirunamam, silk banners in the morning but are more colourfully dressed with face masks for evening parade. 

 

TTD has made all arrangements to keep the pachyderms in control with trained mahouts, chains, and tranquilliser kits. Nearly 27 supporting staff including mahouts are deployed on duty for the procession of animals including two houses, two bulls and 3 elephants in orderly manner and in colourful dressings.

Under supervision of Sri Harnath Reddy, chief of Sri Venkateswara Go Samrakshanashala two elephant experts from Kerala were engaged in handling the animals during vahanam sevas.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 27న తిరుచానూరులో గజవాహనం

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఎంతో ప్రీతిక‌రం

 తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: ‘హస్తినాద ప్రబోధినీంస‌ అనే శ్రీసూక్తం గజానికీ, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఉండే నిత్యానుబంధాన్ని చెబుతోంది. గజ జాతికి ఉన్నతమైంది నాలుగు దంతాలు గల ఐరావతం. ఇది పాలకడలిలో అమృతమథనం జరిగిన వేళ లక్ష్మీదేవితో జన్మించింది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. నాలుగు వేదాల స్వరూపాలైన నాలుగు ఏనుగులు మంత్రస్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని అభిషేకించిన విశేషమైన ఘట్టం శ్రీ పాంచరాత్ర ఆగమంలో ఉంది. ఈ కారణంగా గజ వాహనం అమ్మవారికి ప్రీతికరంగా మారింది. అమ్మవారికి గజపటం, గజవాహనం ఎంతో విశేషమైనవి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గజవాహనసేవ జరుగనుంది.

విశ్వమంతా లక్ష్మీమయమే కానీ, కొన్ని విశిష్ట వస్తువులలో, ప్రదేశాలలో అమ్మవారు ఇష్టపడి నివసిస్తుంది. వాటిని లక్ష్మీనివాస స్థానాలంటారు. అవి 16గా పెద్దలు పేర్కొన్నారు. 1.సత్యం పలికేవాళ్లలో, 2.భగవద్భక్తులలో, 3.శుచి, శుభ్రత, శోభ కలిగిన ఇళ్లలో, 4.మహావీరులలో, 5.జయపతాకాలలో, 6.ఏనుగులలో, 7.గోవులలో, 8.ఛత్రచామరాది చక్రవర్తి లక్షణాలలో, 9.తామరపూలలో, 10.పంటభూములలో, 11.పూలతోటలలో, 12.స్వయంవరాలలో, 13.రత్నాలలో, 14.దీపాలలో, 15.అద్దాలలో, 16.మంగళద్రవ్యాలలో అమ్మవారు ఉంటారు.

వాహనసేవల్లో ముందువ‌రుస‌లో గ‌జాలు

శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం, రాత్రి జరిగే వాహనసేవల్లో గజాలు అగ్రతాంబూలం అందుకుంటున్నాయి. వాహనసేవలో ముందువరుసలో భక్తులకు దర్శనమిచ్చేవి అందంగా అలంకరించిన గజాలు, అశ్వాలు, వృషభాలు. ఇవి రాచఠీవిని ప్రదర్శిస్తుంటాయి. ప్రస్తుతం పద్మావతి(44), లక్ష్మి(50), వైష్ణవి(22), శ్రీనిధి(17)  అనే గజాలు వాహనసేవల్లో తరిస్తున్నాయి. పంచ‌మి తీర్థం రోజు తిరుమ‌ల నుండి మ‌హాల‌క్ష్మి(48) అనే గ‌జం శ్రీ‌వారి సారెను తీసుకొస్తుంది.

ఉదయం జరిగే వాహనసేవల్లో గోవిందనామంతో కనిపించే గజాలు రాత్రి వాహనసేవలకు మరింత అందంగా ముస్తాబవుతాయి. రాత్రి వేళ ముఖపట్టీలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని గజాలకు జూలాస్‌, గంటలు ఉంటాయి. గజాలు అత్యంత భారీగా ఉంటాయి కావున త్వరగా అలసిపోతాయి. అందుకే నిరంతరం ఇవి ఆహారం తీసుకుంటాయి. ఆహారం తీసుకుంటూ ఎంతదూరమైనా నడుస్తుంటాయి. వాహనసేవల్లో విద్యుత్‌ వెలుగులు, వాయిద్యాల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి కావున గజాల దృష్టి అటువైపు మరలకుండా వాటికి ఇష్టమైన చెరుకులు, రావి, మర్రి ఆకులు, కొబ్బరిమట్ట, పచ్చిమేత, అరటి, ఆపిల్‌ పండ్లు అందిస్తుంటారు.

మావ‌టిల‌ను న‌మ్ముతాయి

గజాలది చిన్నపిల్లల మనస్తత్వమ‌ని, ఇవి మావటీలను బాగా నమ్ముతాయని వాహనసేవల విధుల్లో ఉన్న ఎస్వీ గోశాల వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ డా.చైత‌న్య తెలిపారు. భారీశబ్దాలు, ఎక్కువ మంటలను చూస్తే ఇవి భయపడతాయన్నారు. ఈ గజాలు అదుపుతప్పే అవకాశాలు చాలా తక్కువని, ఒకవేళ అదుపుతప్పితే అనుభవజ్ఞులైన మావటులు చేతులతోనే అదుపుచేయగలరని వివరించారు. ఏనుగులను అదుపుచేసేందుకు చెవులకు అంకుశం(ముల్లుకర్ర), కాళ్లకు బేడీలు, పరిస్థితి చేయిదాటితే మత్తు ఇచ్చేందుకు ట్రాంక్విలైజింగ్‌ కిట్‌ను ఉపయోగిస్తామన్నారు.

అదేవిధంగా, 2 అశ్వాలు, 2 వృషభాలు(ఒంగోలు గిత్తలు) వాహనసేవల్లో తరిస్తున్నాయి. అశ్వాలను అల్లికపూలు, కుచ్చులు, ముందుకాళ్లను ఎరుపు బ్యాండ్‌తో అలంకరిస్తారు. వృషభాలను అలంకరణ పూలు, జూలాస్‌, చమ్కీలతో అలంకరిస్తారు. ఈ జంతువుల వద్ద మావటీల, సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 27 మంది విధుల్లో ఉన్నారు.

రాజభటుల వేషధారణ

గజాలు, అశ్వాలు, వృషభాల వద్ద ఉన్న సిబ్బందికి రాజభటుల తరహాలో వేషధారణ ఉంటుంది. శ్రీపద్మావతి అమ్మవారి రాజసానికి ప్రతీకగా ఇలాంటి వస్త్రధారణ చేస్తున్నారు. ఉత్సవాల్లో మొదటి నాలుగు రోజులు ఉదయం నీలిరంగు కోటు, తెలుపు ప్యాంట్‌, తెలుపు టోపి, రాత్రి బంగారు రంగు కోటు, తెలుపు ప్యాంట్‌, తెలుపు టోపిలను సిబ్బంది ధరిస్తారు. ఆ తరువాత నాలుగు రోజులు ఉదయం ఆకుపచ్చ రంగు కోటు, తెలుపు ప్యాంటు, ఎరుపు టోపి, రాత్రి మెరూన్‌ కోటు, తెలుపు ప్యాంట్‌, ఎరుపు టోపిని సిబ్బంది ధరిస్తారు.

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాల డైరెక్టర్‌ శ్రీ హరనాథరెడ్డి ఆధ్వర్యంలో కేర‌ళ నుండి వ‌చ్చిన ఇద్ద‌రు ఏనుగుల నిపుణులు, ఎస్వీ గోశాల వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ డా. చైత‌న్య‌, డైరీ అసిస్టెంట్‌ శ్రీ మహేష్‌ తదితరులు వాహనసేవల్లో జంతువులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.