LADDU, VADA TO PENSIONERS _ నవంబరు 4 నుండి 10వ తేదీ వరకు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
TIRUPATI, 02 NOVEMBER 2022: The distribution of Brahmotsavams Laddu-Vada to TTD retired employees and pensioners will be issued from November 4-10 as per PPO numbers.
On November 4 from 99-3,395 on November 5 from 3396 to 5078, November 7 from 5079 to 6522, from November 8-10 the remaining pensioners will get the Srivari Prasadams.
నవంబరు 4 నుండి 10వ తేదీ వరకు టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
తిరుపతి, 2022 నవంబరు 02: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 4 నుండి 10వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టిటిడి క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి ప్రసాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లకు ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబరు 4న 99 నుండి 3,395 వరకు, నవంబరు 5న 3,396 నుండి 5,078 వరకు, నవంబరు 6న 5,079 నుండి 6,522 వరకు, నవంబరు 7న 6,523 నుండి 7,826 వరకు, నవంబరు 8 నుండి 10వ తేదీ వరకు మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.